Logo
Date of Publish : 01 August 2020, 9:42 am
Editor : Sake Naresh

మూడు రాజధానులపై జనసైనికుడు గునుకుల కిషోర్ స్పందన

మూడు రాజధానులపై జనసైనికుడు గునుకుల కిషోర్ స్పందన. 

                రాజధాని భూముల సేకరణ విషయంలో ఆనాడు పవన్ కళ్యాణ్  అప్పుడు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మరియు నాయకులు రాబోయే రోజుల్లో ఉండరని ప్రభుత్వం మారవచ్చని రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించి భూములను త్యాగం చేసిన రైతులకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాలని తెలియజేశారు. రాజధాని రైతుల అనుమతితో స్వచ్ఛందంగా తీసుకోవాలని పలుమార్లు స్పష్టం చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ రెడ్డి గారు ఉత్తర రాష్ట్రాల వలె మూడున్నర వేల ఎకరాలు సరిపోవని 33 వేల ఎకరాలు కావాల్సిందేనని పట్టుపట్టారు కానీ రాజధాని ఎక్కడ ఉన్నా పర్లేదు అని చెప్పారు. ప్రజల క్షేమం గురించి ఆలోచించినట్లయితే రాజధాని అమరావతిలో వద్దని స్పష్టం చేసేవారు. ఏటా మూడు పంటలు పండే సామర్థ్యం గల పచ్చటి పొలాల్లో భవంతుల నిర్మాణం అనర్ధదాయకం అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో రోజుకి పది వేల కరోనా కేసులు నమోదు అవుతుంటే ప్రజలందరూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు.  ఈ తరుణంలో రాజధాని పై ప్రత్యేక శ్రద్ద ఆపి, ప్రజల ఆరోగ్యం పట్ల మరియు వైద్య సదుపాయాల పట్ల దృష్టి సారించాలని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. గవర్నర్ గారు రెండు బిల్లులు ఆమోదం పొందిన తరుణంలో రైతుల పరిస్థితిపై పార్టీ అధిష్టానం త్వరలోనే ప్రణాళిక చేపడుతుందని నెల్లూరు జనసైనికుడు గునుకుల కిషోర్ స్పందించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com