Logo
Date of Publish : 15 February 2022, 4:31 am
Editor : Sake Naresh

మేడారం జాతరలో సేవకు జనసైనికులు ముందుండాలి : జనసేన నాయకులు ఆకుల సుమన్

     హన్మకొండ, (జనస్వరం) : ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో జనసైనికులు సేవలు అందించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి శ్రీ ఆకుల సుమన్ గారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహా జాతరకు 50లక్షల నుండి కోటి మంది భక్తులు సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకుంటారని కావున ప్రభుత్వం నిర్వహించిన అధికారుల సేవలతో పాటు భక్తులకు జనసైనికులు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమములు నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం కరోనా మూడవ దశ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో జాతర సేవలో పాల్గొనే ప్రతి జనసైనకుడు తప్పనిసరిగా మాస్కు ధరించి శానిటైజేషన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసారు. ఈ మేడారం జాతరతో పాటు కొన్ని గ్రామాలలో జరుగుతున్న మినీ జాతరకు కూడా స్థానికంగా ఉన్న జనసైనికులు సేవలు అందించాలని సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు, ఆహార పదార్థాలు, వృద్ధులకు మరియు వికలాంగులకు వీల్ చైర్లు అందుబాటులో ఉంచుకొని సహాయం చేయాలని తెలియజేసారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com