
ఇచ్ఛాపురం, (జనస్వరం) : ఇచ్చాపురం నియోజకవర్గం ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఎన్. శ్యామల దేవి (వయసు 28 సంవత్సరములు) గత కొద్ది నెలలుగా క్యాన్సర్ తో బాధపడుతున్నది. ఈ విషయం కమలై పుట్టుగా గ్రామ జనసైనికులకు, జనసేనపార్టీ నాయకులకు తెలియడంతో ఇంత చిన్న వయసులోనే క్యాన్సర్ వ్యాధి గురికావడం చాలా బాధాకరమైన విషయంగా భావించి జనసేనపార్టీ సమన్వయకర్త దాసరి రాజు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి సమక్షంలో కమలై పుట్టుగా జనసైనికులు 6000 రూపాయలు ఆర్థిక సహాయం చెయ్యడం జరిగింది. అదే విధంగా మరి కొంతమంది దాతలు వచ్చి ఆర్థిక సహాయం చేసి ప్రాణాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ10వార్డ్ ఇంచార్జ్ రోకళ్ల భాస్కరరావు, జనసైనికులు ఢిల్లీ, సురేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.