విశాఖపట్నం జిల్లా 88 వార్డ్ నరవ గ్రామం విశాఖపట్నం జిల్లాలో జనసేన 88 వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి వబ్బిన జనార్ధన శ్రీకాంత్గారు YSR ఇళ్ల పట్టా అర్హుల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అర్హుల జాబితాలో ఇల్లు లేని బడుగు బలహీనవర్గాల ని పక్కన పెట్టి ఎక్కువ శాతం YSRCP నాయకులు, బంధు ప్రీతి తో వారి బంధువులకు, పార్టీ జండా మోసే ధనవంతులకు అర్హులుగా ప్రకటించారని, వెంటనే అర్హుల జాబితాను మరొక్కసారి సచివాలయ సిబ్బంది మరియు వాలంటరీ వ్యవస్థ తో సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరారు. నరవ గ్రామంలో ఉన్న అర్హులందరికీ ఇల్లు పట్టా జాబితాలో ప్రకటించాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారిని, జీవీఎంసీ కమిషనర్ గారిని, ZONE 5 కమిషనర్ గారిని, జిల్లా యంత్రాంగాన్ని, సచివాలయం సిబ్బందిని కోరడం జరిగింది. అలాగే ఉన్నతాధికారులకు వ్రాత పూర్వకంగా సమస్యను వివరించడం జరిగింది.