టెక్కలి ( జనస్వరం ) : నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్తూ జనసేన పార్టీ బలోపేతానికి జనంతో జనసేన అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.... ఈ కార్యక్రమం కోటబొమ్మాళి మండలంలో కురుడు గ్రామంలో కోలువై ఉన్న శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి రామయ్యపేట గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ప్రతి గడపకి వెళ్తు, పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో వివరిస్తూ... ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ పై ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారి అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ నోట ఈసారి తప్పు చేయమని కళ్యాణ్ గారితోనే రాష్ట్ర౦ అభవృద్ధి చెందుతుందని చెప్పడం మా జనసైనికులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. జనంతో జనసేన కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ నాయకులు మేడిబోయిన సుధీర్, పల్లి కోటేశ్వర రావు, ముడిదాన రాంప్రసాద్ (అడ్వకేట్), వినోద్, చందు, ప్రసాద్, రమేష్, ఉదయ్, శ్రీను , జనార్థన్, భాస్కర్, గణేష్, అజయ్, పవన్, L. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com