Logo
Date of Publish : 28 June 2022, 4:40 pm
Editor : Sake Naresh

ఎస్.లింగాలవలసలో జనసేనకు జననీరాజనాలు

        గజపతినగరం ( జనస్వరం ) : పల్లె పల్లెకు జనసేన పార్టీ కార్యక్రమంలో భాగంగా ఆరో రోజు మంగళవారం గజపతి నగరం మండలం, ఎస్.లింగాల వలసలో గజపతినగరం జనసేన పార్టీ సీనియర్ నాయకులు మర్రాపు సురేష్ పల్లె పల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా ఇంటిఇంటికి జనసేన సిద్దాంతాలతో కూడియున్న కరపత్రాలను పంచుతూ, జనసేన సిద్దాంతాలను ప్రజలకు తెలియజేస్తూ చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఏ గ్రామానికి వెళ్లినా, ఏఇంటికి వెళ్లినా జనసేనకు జననీరాజనాలు పలుకుతున్నారని, ముఖ్యంగా యువత నుండి, మహిళలు నుండి, మరియు వృద్ధులు నుండి జనసేనకు ఒక్కసారి అవకాశం ఇద్దాం, అన్ని పార్టీలను చూసాం ప్రజలకు చేసేందేమి లేదు అని ఇప్పటి వరకు పాలించిన ప్రభుత్వాలపై దుయ్యబట్టడం ప్రజల్లో వచ్చే మార్పుకు సంకేతమని అన్నారు. ఇదే ఉత్సాహంతో ప్రజల్లోకి మరింత బలంగా వెళ్తామన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, మిడతాన రవికుమార్, పండు, కుమిలి దాలి నాయుడు, కడమల శ్రీను, హరీష్ నాని, చలం, పెనుమజ్జి ఆదినారాయణ, పారాది గణేష్, పైల శ్రీను, కునుకు ఈశ్వరావు, మిర్తిపాటి సురేష్, సారికి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com