పొదిలి, (జనస్వరం) : ప్రకాశం జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్, మార్కాపురం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ ఇమ్మడి కాశినాధ్ గారి ఆదేశాల మేరకు జనంలోకి - జనసేన కార్యక్రమంలో భాగంగా పొదిలి మండలం జఫ్ఫాలపురం గ్రామంలో పర్యటన భాగంగా అక్కడి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా అక్కడ నీటి సమస్య వలన అక్కడి ప్రజలు అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా అక్కడి వుండే పిల్లలకు కనీసం ప్రైమరీ పాఠశాల లేకపోవడం చాలా బాధాకరం. ఈ సమస్య మీద జనసేన పార్టీ మరింత ముందుకు తీసుకెళ్లి పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు హల్చల్ జహీర్, నాగార్జున, అర్జున్ యాదవ్, సాయి,సూరి, బాజి, జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com