ఒంగోలు, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మేరకు మరియు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ గారి సూచన మేరకు ఒంగోలులోని 15వ డివిజన్ లో జనంలోకి జనసేన అనే కార్యక్రమం తో ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ డివిజన్ లో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలు ధరల పెరుగుదల, ఆస్తి పన్ను, చెత్త పన్ను పెంపు, డ్రైనేజీ సమస్య,పెన్షన్ లు రావటం లేదు అని ప్రజలు తమ సమస్యలను జనసేన నాయకుల దృష్టి కీ తీసుకొని వచ్చారు. ఈ ప్రభుత్వానికి పన్నులు మీద వున్న శ్రద్ద మౌలిక సదుపాయాలు కల్పించడంలో శ్రద్ద లేదు అని స్థానిక ప్రజలు జనసేన నాయకులు దృష్టి కీ తీసుకొని వచ్చారు. ఈ సమస్యల మీద రానున్న రోజుల్లో ఒంగోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తాము అని జిల్లా అధికారుల దృష్టికి సమస్యలు తీసుకొని పోయి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షలు చిట్టెం ప్రసాద్, కళ్యాణ్ ముత్యాల, తెలగం శెట్టి సుబ్బారావు, చెరుకూరి ఫణి, ఈదుపల్లి మని, భూపతి రమేష్, బొందిల మధు, గిరి ఈదుపల్లి, శంకర్, చంగళశెట్టి సుధాకర్, జొన్న వెంకట్, తోట శబరి, తిరుమలశెట్టి నాని, నరేష్, నరేష్ గంధం, నవీన్ పవర్, షాలు, శ్రీను, సాయి చిన్న, సాయి ఐనబత్తిన, నితిన్ నాయుడు, మరియు జనసేన జిల్లా కార్యదర్శి శ్రీదేవి బొందిల, జనసేన సంయుక్త కార్యదర్శి అరుణ రాయపాటి, ప్రమీల, కోమలి, శిరీష కోసూరి,వాసుకి నాయుడు, తన్నీరు ఉష తదితరులు పాల్గొన్నారు.