ఒంగోలులో ప్రజా సమస్యల పోరాటనికై "జనంలోకి జనసేన" కార్యక్రమంలో భాగంగా (4వ వారం) 16వ డివిజన్ లో బాలాజీ నగర్ మరియు బత్తులవారి కుంట ఏరియాలో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి ప్రధాన సమస్యలైన తాగునీరు, ఇళ్ళపట్టాలు లేవని మరియు ప్రజల ప్రధాన సమస్య అయిన అగ్రహారం రైల్వేగేటు అండర్ పాసింగ్ ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ అధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన నాయకులతో స్థానికులు మాట్లాడుతూ గత 3 దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని అత్యవసర సమయంలో కుడా ఈ రైల్వేగేటు తీయని పరిస్థితి ఉందని అన్నారు. ఈ విషయంపై అనేక సార్లు రైల్వే అధికారుల దృష్టికి మరియు స్థానిక M.P గారి దృష్టికి తీసుకొని వెళ్తే వాళ్ళు ఇక్కడ రైల్వే ప్లైఓవర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారే కానీ, పనులు ప్రారంభించలేదని జనసేన నాయకులతో వాపోయారు. 16వడివిజన్ ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు ఆ డివిజన్ లో బసచేస్తే అప్పుడు ప్రజలు పడుతున్న కష్టాలు ఆ నాయకులకి తెలుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సమస్యను వెంటనే పరిష్కరించాలని లేదంటే జనసేనపార్టీ అధ్వర్యంలో దీనిపై ప్రత్యేక కార్యచరణ రూపో౦దించి జిల్లా అధ్యక్షులు sk.రియాజ్ గారి నాయకత్వంలో డివిజన్ సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ రాజీపడని పోరాటం చేస్తుందని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిల్లి రాజేష్, బండారు సురేష్, ఈదుపల్లి గిరి, టంగుటూరి శ్రీను, ఫణి, శంకర్, పోకల నరేంద్ర, కిషోర్, సుధాకర్, భూపతి రమేష్, బ్రహ్మ నాయుడు, తిరుమల శెట్టి నాని, అవినాష్, మాల్యాద్రి నాయుడు, చరణ్, అనీల్, వినయ్, భరత్, వీరమహిళలు కోమలి, వాసుకి, అరుణ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com