Logo
Date of Publish : 12 July 2021, 4:04 am
Editor : Sake Naresh

ఒంగోలులో ప్రజా సమస్యల పోరాటానికై ” జనంలోకి జనసేన ” కార్యక్రమం ( 4 వవారం )

                ఒంగోలులో ప్రజా సమస్యల పోరాటనికై "జనంలోకి జనసేన" కార్యక్రమంలో భాగంగా (4వ వారం) 16వ డివిజన్ లో బాలాజీ నగర్ మరియు బత్తులవారి కుంట ఏరియాలో పర్యటించి  ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి ప్రధాన సమస్యలైన తాగునీరు, ఇళ్ళపట్టాలు లేవని మరియు ప్రజల ప్రధాన సమస్య అయిన అగ్రహారం రైల్వేగేటు అండర్ పాసింగ్ ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ అధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన నాయకులతో స్థానికులు మాట్లాడుతూ గత 3 దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని అత్యవసర సమయంలో కుడా ఈ రైల్వేగేటు తీయని పరిస్థితి ఉందని అన్నారు. ఈ విషయంపై అనేక సార్లు రైల్వే అధికారుల దృష్టికి మరియు స్థానిక M.P గారి దృష్టికి తీసుకొని వెళ్తే వాళ్ళు ఇక్కడ రైల్వే ప్లైఓవర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారే కానీ, పనులు ప్రారంభించలేదని జనసేన నాయకులతో వాపోయారు. ఒంగోలు 16వడివిజన్ ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు ఆ డివిజన్ లో బసచేస్తే అప్పుడు ప్రజలు పడుతున్న కష్టాలు ఆ నాయకులకి తెలుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సమస్యను వెంటనే పరిష్కరించాలని లేదంటే జనసేనపార్టీ  అధ్వర్యంలో దీనిపై ప్రత్యేక కార్యచరణ రూపో౦దించి జిల్లా అధ్యక్షులు sk.రియాజ్ గారి నాయకత్వంలో డివిజన్  సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ రాజీపడని పోరాటం చేస్తుందని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిల్లి రాజేష్, బండారు సురేష్, ఈదుపల్లి గిరి, టంగుటూరి శ్రీను, ఫణి, శంకర్, పోకల నరేంద్ర, కిషోర్, సుధాకర్, భూపతి రమేష్, బ్రహ్మ నాయుడు, తిరుమల శెట్టి నాని, అవినాష్, మాల్యాద్రి నాయుడు, చరణ్, అనీల్, వినయ్, భరత్, వీరమహిళలు కోమలి, వాసుకి, అరుణ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com