రాజంపేట ( జనస్వరం ) : నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన నేత యల్లటూరి శ్రీనివాసరాజు గారు చేపట్టిన జనంలో జనసేన కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా వీరబల్లి మండల పరిధిలోని గుఱ్ఱప్పగారిపల్లి గ్రామ పంచాయితీ పరిధిలో పలు గ్రామాల్లో ఇంటింటికి జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ జనసైనికులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రతి గడప వద్దకు తీసుకెళ్లి జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు గుర్తును అదేవిధంగా జనసేన అధినాయకత్వాన్ని గుర్తించాలని ఒక అవకాశం ఇవ్వాలని కోరుతూ కరపత్రాలను పంచామని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను సేకరించి రానున్న ఉమ్మడి ప్రభుత్వం ద్వారా సమస్యలు అనింటికి పరిష్కారం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దినేష్, పవన్, సురేష్, నగేష్, నరసింహులు, శివానంద్, రవి యల్లప్ప, బంగారప్ప, శివ, జయపతి, రాజారాం, రమేష్, లక్షుంపతి, రాజానాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com