పిఠాపురం ( జనస్వరం ) : ఉప్పాడ కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామంలో పిఠాపురం జనసేన ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు జనసేన నాయకులు నాగార్జున అధ్వర్యంలో పి.ఎస్.ఎన్. మూర్తి సంక్రాంతి కానుకగా సుమారు 25 మందికి బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బుర్రా సూర్యప్రకాష్, టైల్స్ బాబి పాల్గొని మాట్లాడుతూ జనం కోసం జనసేన ఎప్పడు అండగా ఉంటుంది అన్నారు. జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సొంత ఇళ్ళు లేని వారికి పక్కా ఇళ్లు ఇప్పిస్తాము అని మాట ఇచ్చారు. మీరు అందరూ జనసేన తెలుగుదేశం కూటమికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సంక్రాంతి కానుక తీసుకున్న లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు పొన్నాడలో వున్న సమస్యలు జనసేన నాయకులకు తెలియజేశారు. సంక్రాంతి కానుక అందజేసిన జనసేన ఇంఛార్జి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కి కృత్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిండి శ్రీను, పెదిరెడ్ల భీమేశ్వరరావు, బీసీ నాయకులు మల్లం శ్రీనివాస్, ముప్పన రత్నం, పెంకే జగదీష్, పెనుమచ్చ రమా దేవి, విజ్జడా దుర్గాదేవి, కొప్పిశెట్టి దేవి, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com