గోనెగండ్ల, (జనస్వరం) : గ్రామాల్లో నెలకొన్న త్రాగునీరు, డ్రైనేజి, సమస్యలను పరిష్కరించాలని జనసేన పార్టీ నాయకులు గానిగ బాషా, ఖాసీం సాహెబ్, మాలిక్ ఆధ్వర్యంలో మండల కేంద్రంమైన గోనెగండ్లలో సోమవారం రోజు జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అనునిత్యం కార్యకర్తలు ప్రజల్లో వుంటూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం సైనికుల్లా పనిచేయుటకు కలసికట్టుగా రావాలని తెలిపారు. గ్రామాల్లో జనసేన ప్రజా పోరాట యాత్రలు నిర్వహించి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ప్రజా ప్రతినిధులపై అధికారులపై ఒత్తిడి పెంచి సమస్యలు పరిష్కరించేలా కృషిచేద్దామని అన్నారు. గోనెగండ్లలోని పలు విధుల్లో డ్రైనేజి సమస్యతో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని చినుకు పడితే చిత్తడి చిత్తడిగా మారి ఇంటి పరిసరాల్లో మురికినిరు చెత్తా చెదారంతో దుర్వాసన వేదజల్లుతూ దోమల కాటుకు గురై అనారోగ్యాల భారిన పడుతున్నారని గ్రామాల్లో ఇలాంటివి సమస్యలు ఎన్నో విలయతాండవం చేస్తుంటే కనపడక పోవడం సిగ్గుచేటన్నారు. ప్రజల సహకారంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి గ్రామాల్లో నెలకొన్న సమస్యల సాధన కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అభివృద్ధిని విస్మరిస్తే గుణపాఠం తప్పదని స్పష్టం చేశారు. ప్రతి సోమవారం రోజున నిర్వహించే జనంలోకి జనసేన కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని అలుపెరగని పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షఫీ, మాబాష, రవికుమార్, మహబూబ్ బాషా, అక్బర్, అలి బాషా, దూద్ పిరా, నబి రసూల్ తదితరులు పాల్గొన్నారు.