
చింతలపూడి ( జనస్వరం ) : “జనంలోకి జనసేన – జనసేనలోకి జనం” కార్యక్రమం లింగపాలెం మండలం తువ్వచిలకరాయుడుపాలెం గ్రామంలో బంటు సామ్యూల్ రాజు ఆధ్వర్యంలో చింతలపూడి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ మేకా ఈశ్వరయ్య అధ్యక్షతన ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లింగపాలెం మండల అధ్యక్షులు పంది మహేష్ బాబు, మాజీ మండల ప్రెసిడెంట్ మాదాసు కృష్ణ, ఉపాధ్యక్షులు తాళం మల్లేశ్వరరావు, పఠాన్ యాకువలి, చల్లా నాగబాబు, కార్యదర్శులు పంది సతీష్ కుమార్, పొదిల మహేష్, కలవకొల్లు నాగరాజు, సంయుక్త కార్యదర్శి ముత్యాల నాగేంద్ర, వీరమహిళ బంటు సంధ్యారాణి, ముఖ్య నాయకులు సాయిల ప్రేమ్ కుమార్, కొత్తపల్లి గ్రామ జనసైనికులు దేవిని రాంబాబు, మండపాటి మణికంఠ, వినీల్, సురేంద్ర, మరియు తువ్వచిలకరాయుడుపాలెం జనసైనికులు పాల్గొన్నారు.