పిఠాపురం, (జనస్వరం) : పిఠాపురం జనసేన ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాలు మేరకు పిఠాపురం మోహన్ నగర్ లో ముస్లిం సోదరీ మణులకు md అధ్వర్యంలో పి ఎస్ ఎన్ మూర్తి & పిండి శ్రీనువాస్ సంక్రాంతి కానుకగా చీరలు పంచడం జరిగింది. పి ఎస్ ఎన్ మూర్తి మాట్లాడుతూ జనం కోసం జనసేన ఎప్పడు అండగా ఉంటుంది అని మేము అధికారం లోకి రాగానే మీకు పక్కా ఇళ్లు ఇప్పిస్తాము అని మాట ఇచ్చారు. మీరు అందరూ జనసేన తెలుగుదేశం కూటమికి ఓటు వేసి గెలిపించండి అని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, పెంకే జగదీష్, ముప్పన రత్నం, ప్రసాద్ , సిరా రాజు, md, పి రాజు, పి చరణ్, టీ రాజు, పి కృప, కె ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.