
ముత్యాల పాలెం రోడ్ల పరిస్థితి గురించి స్థానికులతో చర్చించి, అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్న జనసేన నాయకులు గునుకులకిషోర్
నెల్లూరు రూరల్ ముత్యాల పాలెం రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండడంతో స్థానిక జనసేన నాయకులు ఆనంద్ ని స్థానికులు అభ్యర్థించడంతో జనసేన పార్లమెంటరీ ఇంఛార్జి మనుక్రాంత్ గారు సూచనల మేరకు జనసేన నాయకులు కిషోర్ గునుకుల మరియు కార్యకర్తలు అక్కడికి వెళ్లి స్థానికులను అడిగి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించి అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం 3 సంవత్సరాల క్రిందట అభివృద్ధి పేరుతో డ్రైనేజ్ మరియు త్రాగునీటి కనెక్షన్ల నిమిత్తం బాగా ఉన్న రోడ్లను త్రవ్వి ఇప్పటిదాకా రోడ్లు వేయకపోవటం వలన స్థానికులు తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు. స్థానికులకు అనారోగం బారిన పడితే హాస్పిటల్ కి వెళ్ళాలన్నా, కాలం చెలిన వారిని బయటకి తీసుకు వెళ్లాలన్నా వాహనాలు సందు లోపలికి రాలేక పోవడం తో ఇబ్బందిగా ఉంది. పిల్లలు, పెద్దవాళ్ళు నడవటానికి కూడా తీవ్ర ఇబ్బందిగా ఉంది. వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒక సంవత్సర క్రిందట స్థానిక జనసేన కార్యకర్త సహయంతో డ్రైనేజ్ కాంట్రాక్టర్లు మరోసారి గుంతలు వేయగా ఆ గుంతలు పూడ్చమని స్థానికులు నిలదీయడంతో అది మా పని కాదు అని తప్పించుకున్నారు. దాంతో స్థానిక నాయకులను అడుగగా జనసేన నాయకులను అడిగి చేయించుకోమని బదులిచ్చారు. ఓట్లు వాళ్ళు వేయించుకొని జనసేనను ప్రజా పనులు చేయమనడం ఎంత వరకు సబబు. దాదాపు 150 కుటుంబాలు ఉన్న ఏరియాలో ప్రజలు నడవాలన్న, బైక్ పై తిరగలన్న ఇబ్బందిగా ఉంది అని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడంలేదు. S.C కార్పోరేషన్ క్రింద మొదటగా ఈ ప్రాంతానికి మంజూరైన నిధులు ధనికులు ఉండే బ్యాంకర్స్ కాలనీలో వేసి నిధులు లేవంటూ మొండిచేయి చూపిస్తున్నారు. స్థానికులు అందరి ద్వారా సంతకాలు సేకరించి కలెక్టర్ గారిని కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తామని మరియు అండగా నిలబెడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్, ఆనంద్, వాణి, మునెమ్మ, నాగభూషణమ్మ, భారతి, గణేష్, నరేష్, ప్రశాంత్ గౌడ్, శశంక్, విక్రాంత్, సాయి తేజ పాల్గొన్నారు.