Logo
Date of Publish : 23 December 2023, 7:55 pm
Editor : Sake Naresh

24వ డివిజన్ లో దిగ్విజయంగా ముగిసిన జనచైతన్యయాత్ర

   ఒంగోలు ( జనస్వరం ) : నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా జనచైతన్య యాత్ర 69వ రోజు ఒంగోలులోని 24వ డివిజన్ లో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు జనసేన నాయకులతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో మమ్మల్ని బాగా ప్రభావితం చేసిందని, బడుగు బలహీన వర్గాలను ఇప్పటివరకు అందరూ ఓటు బ్యాంకు గానే చూశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఓటు బ్యాంకుగా కాకుండా వారిని కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తామని చెప్పడం మమ్మల్ని బాగా ఆకర్షించాయని అన్నారు. అలానే స్థానిక యువత కూడా మాట్లాడుతూ సరైన ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నామని తాను అధికారంలోకి వస్తే పదిమందికి ఉపాధి కల్పించేలా యువతను తయారు చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధానం మాకు బాగా నచ్చిందని అన్నారు. అలాంటి నాయకుడి వెంట నడవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తమ పూర్తి మద్దతు జనసేన పార్టీకి ఉంటుందని నాయకులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ఇప్పటిదాకా ఈ ప్రాంత సమస్యలన్నీ నోట్ చేసుకున్నామని అది కొద్ది రోజుల్లో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని పోయి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు,కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్, వీర మహిళ మాదాసు సాయి నాయుడు, మరియు జనసేన నాయకులు అరవింద్ బాబు ముత్యాల, బాయ్రెడ్డి వేణు, గలగల పవన్, రాఘవ చంగళశెట్టి, నరసింహారావు, అవినాష్ నాయుడు పర్చూరి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com