విజయనగరం ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు విజయనగరం స్థానిక 31వ వార్డ్ కంటోన్మెంట్ గెంజిపేటలో జనబాటకు జనసేన పార్టీ సీనియర్ కార్యకర్త త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కోఆర్డినేటర్ గడసాల అప్పారావు హాజరయ్యారు. జనసేన ఝాన్సీ వీరమహిళలు తుమ్మిలక్ష్మీరాజ్, కాటం అశ్విని, ముదిలి సర్వమంగల గారు, Ch. సంతోష్, వెంకటేష్, విస్వతేజ జనసేన విధానాల కరపత్రాలను ఇంటిఇంటికీ ఇచ్చి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ వీధిలో ఓటు నమోదుకాని యువతీయువకులు సుమారు 30 మందిని గుర్తించడం జరిగింది. వారికి కలెక్టర్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు కౌంటర్లో ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com