గాజువాక ( జనస్వరం ) : నియోజకవర్గం పరిధిలో వున్న సగర /ఉప్పర సామజికవర్గ సంక్షేమానికి, వారి జీవనప్రమాణాలు మెరుగుదలకు జనసేన పార్టి కృషి చేస్తుందని సగర సామజిక వర్గ సమావేశంలో ముఖ్య అతిదిగా హాజరైన పార్టీ PAC సభ్యులు, గాజువాక ఇంచార్జి కోన తాతారావు అన్నారు. నియోజకవర్గంలో వున్న 19 గ్రామాల సగర కుల సంఘాల ఐక్య సమావేశం నక్క గోవింద అధ్యక్షతన జరిగింది. వారి యొక్క సమస్యలు..
1. ఆర్థికంగా, సమాజకంగా వెనుకబడి ఉన్న సగర /ఉప్పర కులాన్ని BC ‘D’ నుంచి BC ‘A’ జాబితాకి మార్చాలని
2. కుల సర్టిఫికెట్ ఉప్పర కి బదులు సగర అని ఇవ్వాలని
3. నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలమెంట్ సదుపాయాలు
4.వారి కార్పొరేషన్ కు మెరుగైన నిధులు ఇవ్వాలని
రాజకీయ, సామజిక అభివృద్ధికి చేయూత నివ్వాలని కోరగా..
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్తానని, PAC సభ్యులుగా అవసరమైత జనసేన మేనిఫెస్టో లో చేర్చేందుకు కృషి చేస్తానని మీరందరు జనసేన, టిడిపి ల భాగస్వామ్యానికి చేయూత నివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుర్రం నూకరాజు, ఉపాధ్యక్షులు నక్క రాంబాబు, సంఘ నాయుకులు ద్రోనాద్రి సూరి అప్పారావు, నక్క ఆదిలక్ష్మి, అనురాధ, గజ్జల నూకరాజు, నక్క చిన్న, గుర్రాల చిన్న, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.