Logo
Date of Publish : 03 September 2022, 5:10 pm
Editor : Sake Naresh

వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం ఖాయం : వేగుళ్ళ లీలా కృష్ణ

           మండపేట ( జనస్వరం ) : మండపేట:-వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం ఖాయమని జన సేన మండపేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ పేర్కొన్నారు.జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పట్టణ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు మామిడాల మనో కృష్ణ ఆధ్వర్యంలో స్థానిక కాపుకళ్యాణ్ మండపంలో శుక్రవారం మెగా రక్త దాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ ప్రారంభించారు. కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ మీడియా తో మాట్లాడుతూ 2023 లోనే ఏ పి ఎన్నికలు నిర్వహిస్తారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో జన సేన ప్రభంజనం విస్తోందని సర్వే లు తేటతెల్లం చేస్తున్న నేపథ్యంలో తాను మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గా గెలుపొంది వచ్చే ఏడాది పవన్ పుట్టినరోజు కు తన ఎమ్మెల్యే పదవి కానుక గా అధినేత పవన్ కు అంకితం ఇస్తానని ధీమా వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యం గా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. అక్టోబర్ 5 విజయదశమి నుండి నియోజకవర్గంలో గ్రామ గ్రామ న పర్యటించి సమస్యలపై గళమెత్తు తామని పేర్కొన్నారు. వచ్చే పుట్టినరోజు నాటికి ఎన్నికలు ముందుగా నే వచ్చేస్తాయని జోస్యం చెప్పారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గా తాను ఎన్నికై పవన్ కు పుట్టినరోజు కానుక గా తన విజయాన్ని అంకితమిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి జిల్లా కార్యదర్శి కొమ్ముశెట్టి సూరిబాబు, సంయుక్త కార్యదర్శి దాలపర్తి శ్రీనివాస్, వల్లూరు సర్పంచ్ దాసి మీనా కుమారి, చెల్లూరు ఎంపీటిసి గొల్లపల్లి అనురాధ, పార్టీ నాయకులు కుంచె ప్రసాద్, కొంతం నాగేంద్ర ప్రసాద్, వల్లూరి సత్య ప్రసాద్, టంకాల చిన్ని, బసవరాజు, బొమ్మన సతీష్, సుంకర మణికంఠ, మొరం బాలాజీ, బండారు సతీష్, నిమ్మ రమేష్, కొనే గణేష్, వైజయంతి రాజు, పెడిమళ్ల సతీష్, ర్యాలీ బ్రమజి, గెడ్డపు కిరణ్, పొలమురి విజయ్, గంటి రాజు, పొలిశెట్టి గోపాల్, షేక్ రెహమాన్,కర్ర సాయి రామ్ రెడ్డి పవన్ కుమార్ లు తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో మొత్తం 251 మంది రక్తదానం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com