
అరకు ( జనస్వరం ) : జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని అరకు నియోజవర్గం జనసేన పార్టీ మాజీ( ఎంపీటీసీ ) సాయిబాబా దురియా తెలిపారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల పట్ల దాష్టిక పాలన వ్యవహరిస్తుందని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను పరిష్కరించే దాంట్లో వైసిపి ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. జగన్ రెడ్డి పరిపాలిస్తున్న రాక్షస పాలనను అంతం చేసి రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాలని ఉద్దేశంతోనే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో ముందుకెళ్లాలని, మన రాష్ట్ర బాధ్యత తన బాధ్యతతో తీసుకొని 2024లో జరుగు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని ఈ సందర్భంగా శుక్రవారం పత్రిక ప్రస్థానం ద్వారా తెలిపారు.