– టిడిపి మేధస్సుకు జనసేన యువశక్తి తోడైంది
– ఈసారి జగన్ కు “సున్నా”నే
– టిడిపి, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి, (జనస్వరం) : ప్రజాస్వామ్యాన్ని తిరిగి పరిరక్షించడం కోసమే టిడిపితో జనసేన పొత్తు పెట్టుకుందన్నారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య. సోమవారం టిడిపి చిత్తూరు జిల్లా కార్యాలయంలో జరిగిన టిడిపి, జనసేన సమన్వయ కమిటీ సమావేశానికి పార్టీ పరిశీలకులుగా విచ్చేసిన ఆయన ప్రసంగించారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ లు కూడా వేయనీయకుండా అడ్డుకున్నారన్నారు. ఆ ఎన్నికల్లో వైసిపి నైతికంగా ఓడిపోయిందన్నారు. టిడిపి పోటీ చేసి ఉంటే వైసిపి శక్తి ఏంటో జగన్ కు అర్థమై ఉండేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన సమన్వయంతో పనిచేస్తే జగన్ మోహన్ రెడ్డికి “సున్నా” రావడం ఖాయమన్నారు. ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకునేందుకు రెండు పార్టీల నేతలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. జనసేన జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ, యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయన్నారు. జగన్ కు అధికారం మీద ఉన్న శ్రద్ద పాలనపై లేదన్నారు. మళ్లీ సిఎం అవ్వడం కోసం ధనం, దౌర్జన్యాలను ఆయుధాలుగా మార్చుకున్నాడన్నారు. ప్రకృతి వనరులతో పాటు రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాడని దుయ్యబట్టారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రోటోకాల్ ఇబ్బంది లేకుండా రెండు పార్టీలు సమన్వయంతో పనిచేసి జగన్ రెడ్డినీ ఇంటికి పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరపున పాల్గొన్న తిరుపతి అసెంబ్లీ ఇంఛార్జి కిరణ్ రాయల్, పీలేరు ఇంఛార్జి దినేష్ , GD నెల్లూరు ఇంఛార్జి డా.పోన్నా యుగంధర్, శ్రీకాళహస్తి ఇంఛార్జి వినుత, రాష్ట్ర నాయకులు ఆకేపాటి సుభాషిణి, కీర్తన ఆరణి కవిత , ఆకుల వనజ జనసేన నాయకులు మరియు టిడిపి నుంచి ఆ పార్టీ పరిశీలకులు బీద రవిచంద్ర, జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని,మాజీ మంత్రి అమరనాధరెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ, శంకర్ యాదవ్, పరసారత్నం, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహయాదవ్, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, రాష్ట్ర డిసిప్లనరీ సభ్యులు పిఎస్ మునిరత్నం, చిత్తూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కోదండ యాద్ తదితరులు పాల్గొన్నారు.