స్వదేశాన్ని జాగృతం చేయటమే కాకుండా విదేశాల్లో తన ఉపన్యాసాలు ద్వారా మన దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన స్వామి వివేకానంద జయంతి జనవరి 12 తేదీని జాతీయ యువజన దినోత్సవంగా ఆయన గుర్తుగా నిర్వహిస్తున్నాం అంటే ఆయన కీర్తి అజరామరం. మానవ జీవితంలో 3 దశల్లో యవ్వన దశ భావి జీవితానికి స్థిరమైన పునాదిగా నిలిచే దశ. మనదేశంలో సహజ వనరులతో సమానంగా మానవ వనరులు ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం 15 - 35 లోపు వయసు ఉన్న వారు యువతగా లెక్కించబడుతూ 60% శాతానికి మించి ఉన్నారు. శారీరక, మానసిక ఎదుగుదలతో పాటు వ్యకిత్వ వికాసం, మంచి చెడులు వ్యత్యాసం, సందేహాలు తీర్చుకుంటూ, సంశయాలను వీడుతూ, నైపుణ్యాలను పెంచుకుంటూ సగర్వంగా ఒక ఉన్నతమైన వ్యక్తిగా నిలబడే స్థితి.
నాటి స్వాతంత్ర్య పోరాటం నుండి నేటి వరకు యువత భాగస్వామ్యం లేకుండా ఏ ఉద్యమం లేదు, ఏ పోరాటం సాగలేదు. మన్యం వీరుడు అల్లూరి, షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లాంటి అమర వీరులు బానిసత్వం నుండి స్వేచ్ఛ కోసం, పరాయి పాలన నుండి విముక్తి కోసం ప్రాణాలు లెక్క చేయక పోరాడి ప్రాణ త్యాగం చేసి అమరులుగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. నేటి యువతలో ఆ స్ఫూర్తి రావాలి. దేశం కోసం, సమాజం కోసం, నేటి రాజకీయాలలో తమ దైన పాత్రను నిర్వహించాలి.
"కొంత మంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు" అని మహాకవి శ్రీ శ్రీ గారి మాటలను ఒక పాఠంగా తీసుకొని భావి తరాల కోసం, మతం మత్తులో పడకుండా కులం కంపులో పడి కొట్టుకొని పోకుండా, అవినీతి, అక్రమాల పై దుర్మార్గపు దోపిడీల మయం అయిన దుర్గంధపు సమాజాన్ని సరైన మార్గంలో పెట్టి నడిపించే గల యువశక్తి కూడగట్టుకొని 'లేవండి.. మేల్కోండి... గమ్యం చేరే వరకు విశ్రమించకండి" అని ప్రపంచానికి ఉపదేశం చేసిన వివేకానందుని స్ఫూర్తిని నింపుకొని విద్య, ఉపాధి, ఉద్యోగం, రాజకీయం, ఏది చేపట్టినా పట్టువదలక విజయ ప్రస్థానం సాగించాలి. యువత తలుచుకుంటే అసాధ్యం అనుకున్నది సాధ్యం అయి తీరుతుంది. విజయం వైపు పయనం సాగాలంటే లక్ష్యం ఉండాలి ఆ లక్ష్య సాధనకు తగిన ప్రణాళికలు, పట్టుదల ముఖ్యం కానీ నేటి యువత వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు, తమని తాము శక్తి హీనులుగా మార్చుకుంటుంన్నారు. మాదక ద్రవ్యాల మత్తులో భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. కనీసం పరిస్థితులను పరిశీలన, మంచి చెడులు విచక్షణ, తప్పు ఒప్పుల విశ్లేషణ లేకుండా గడిపే కొందరికి దానికి విరుద్ధంగా బాధ్యత గల యువతగా సేవా, సామాజిక, రాజకీయ రంగాలతో పాటు కుటుంబ వ్యవస్థ కు ప్రాణం పోస్తూ ఇతరులకు స్ఫూర్తిని నింపేలా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం చాలా అవసరం. రాజ్యాంగ బద్దంగా లభించిన హక్కులు, బాధ్యతలు పాటిస్తూ అవినీతి, అక్రమాలపై ఓటు అనే వజ్రాయుధంతో గెలుపు, ఓటములు నిర్ణయాధికారం ద్వారా సమర్థులైన నాయకులను పాలకులుగా ఎన్నుకోవచ్చు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విజయాలను, అపజయాలను నిర్ణయించగల శక్తి యువశక్తి. రాజకీయ నేతల తల రాతలు తారుమారు చేసేది యువతే.
అత్యంత బలమైన యువతను నాయకులు గా తీర్చి దిద్ది రేపటి భవితవ్యానికి బాటలు వేసేలా ప్రోత్సాహం అందిస్తే అందనంత ఎత్తుకు చేరుకోగలరు. "ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం" అని స్వామి వివేకానంద, "కొంత మంది యువకులు రాబోవు యుగం దూతలు పావన నవజీవన బృందావన నిర్మాతలు" - మహా కవి శ్రీ శ్రీ గారు చెప్పినా యువశక్తి ప్రాధాన్యత తెలుపటమే. పాతికేళ్ల జనసేన పార్టీ ప్రస్థానంలో శక్తివంతమైన ఆ యువత గళం నుండి సమస్యలను, సమస్యల పరిష్కారానికి మార్గం కనుగొనేందుకు, రేపటి తరాల నాయకులుగా తీర్చిదిద్దే కార్యక్రమం "జనసేన యువ శక్తి"
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com