శ్రీకాకుళం ( జనస్వరం ) : శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుకి గల కారణాలు, అభివృద్ధి చెందడానికి, వలసలు ఆగడానికి మీ అమూల్యమైన సలహాలు, దశాబ్దాలు కాలంగా ప్రజల గుండెల్లో రగులుతున్న ఆవేదన తెలియజేయడానికి, జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం రామలక్ష్మణ కూడలిలో సోమవారం జరుగుతున్న యువగర్జన కార్యక్రమంలో పార్టీలకతీతంగా ప్రజలందరూ పాల్గొని మన సమస్యలును వినిపించారు. జిల్లాలో దశాబ్దాలకాలంగా వలసలు ఆగాలి, ఉద్యోగాలు కావాలి అనే నినాదంతో ఈ రోజు అధినేత ఆదేశాలమేరకు నిరసన దీక్షా చేపట్టామని జనసేన నాయకులు అన్నారు. ఈ వలసలు ఆగటానికి గల ముఖ్యకారణం పాలక ప్రభుత్వాలే కారణమన్నారు. దేశనలుమూలలా మన శ్రీకాకుళం జిల్లావాసులు ఉంటారని, ఉద్యోగాలు లేక కుటుంబాలకు దూరంగా వెళ్ళిపోవటం దురదృష్టకరమని జనసేన నాయకులు అన్నారు. విజన్ ౩౩ ప్రకారం జనసేన పార్టీ వస్తే వలసలు ఆగటమే లక్ష్యంగా పనిచేస్తామని జనసేన నాయకులు అన్నారు. జనసేన యువగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జనసేన నాయకులకు, కార్యకర్తలకు వీర మహిళలకు, విద్యార్థులకు, పార్టీలకు అతీతంగా పాల్గొన్న ప్రజనికానికు శ్రీకాకుళం జిల్లా నాయకుల ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు పేడాడ రామ్మోహన్రావు, గేదల చైతన్య, కనితి కిరణ్ కుమార్, దాసరి రాజు, విశ్వక్సే సేన్, తిప్పన దుర్యోధన రెడ్డి బైపల్లి ఈశ్వరరావు తూర్పు కాపు అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, గర్భాన సత్తిబాబు, ఎన్ని రాజు, దుర్గారావు , సంతోష్ పాండా, హరీష్ కుమార్ శ్రీకాంత్ , యూపీ రాజు, మండల అధ్యక్షులు జనసేన వీర మహిళలు, మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.