తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : కుంచనపల్లి గ్రామంలో రెండు రోజుల పల్లెపోరు అక్కడ ప్రజల మధ్యలో అట్టహాసంగా మంగళవారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీనువాస్ మాట్లాడుతూ కుంచనపల్లి గ్రామ ప్రజలు నన్ను ఆదరించినట్టు వచ్చె సార్వత్రిక ఎన్నికలో జనసేనాని ఆదరించి పవన్ కళ్యాణ్ గారినీ ఉమ్మడి సీఎం గా చేయాలని ఇక్కడ అసెంబ్లీ స్థానానికి నన్ను గెలిపించాలని కుంచనపల్లి ప్రజలను కోరారు. అంతే కాకుండా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగున్నర సంవత్సరాలు దాటిన మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేక పోవడం మన దురదృష్టం అని అన్నారు. ఈ కుంచనపల్లిగ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ పై ఇక్కడ ప్రజలు గత నాలుగు సంవత్సరాలుగా స్థానిక ఎమ్మెల్యేతో పోరాడిన ఎం లాభం లేకుండా పోయిందని అన్నారు. జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే కుంచనపల్లి డ్రైనేజీ వ్యవస్థని బాగుపరుస్తానని ఇక్కడ ప్రజలతో బొలిశెట్టి అన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, స్థానిక నాయకులు సోమ శంకర్, కోట శ్రీ రామ్, కొరుకులూరి వెంకట రెడ్డి, సుంకర దుర్గ ప్రసాద్, మేక బుల్లి వెంకన్న, మేక శ్రీనివాస్, పంచదార కొండ, పంచదార సురేష్, చీల్ల అబ్బు, తోట నరేష్, మధు నాయుడు మరియు జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com