ఎమ్మిగనూరు ( జనస్వరం ) : గ్రామల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పాలకులు కృషిచేయాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన గోనెగండ్లలో జనసైన నాయకులు జనంలోకి జనసేన కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన నాయకుల్లో అధికారుల్లో మాత్రం చలనం లేదని జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి రేఖగౌడ్ పాలకుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు, ఎన్నికల ముందు ఓట్ల కోసం ప్రజల సమస్యలు గుర్తుకొచ్చిన మీకు ఎన్నికల తరువాత ఎందుకు గుర్తుకు రావడం లేదని విమర్శించారు, ప్రజా సమస్యలను వాల్ పోస్టర్ల రూపంలో విడుదల చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు, ప్రభుత్వ పాలకుల తీరుకు నిరసనగా గోనెగండ్లలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించి ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని గ్రామాల్లో నెలకొన్న సమస్యల సాధనకోసం అలుపెరగని పోరాటాలకు జనసైనికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు, సెప్టెంబర్ 2 న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని గోనెగండ్లలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నందున అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున్న పాల్గొని విజయవంతం చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గానిగ బాషా, మాలిక్, షఫీ,మాబాష, అలీ బాషా, దూద్ పిరా, మల్లి, మధు, భాస్కర్, గబ్బర్ సింగ్, సాధిక్, మహమ్మద్ హుస్సేన్, ఖాసీం, మునాఫ్,హనుమంతు, హీనయతుల్లా పాల్గొన్నారు,