Logo
Date of Publish : 01 February 2024, 10:17 pm
Editor : Sake Naresh

50వ రోజు చేరుకున్న జనసేన విజయ యాత్ర – AP NEEDS PAWAN KALYAN

  శ్రీకాళహస్తి ( జనస్వరం ) : రేణిగుంట మండలం, మామండూరు పంచాయతీలోని మామండూరు, కుక్కల దొడ్డి గ్రామాలలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి వినుత కోటా..50 వ రోజు కార్యక్రమంకి పూల వర్షంతో కేక్ కట్ చేసి ఘనంగా వినుత గారికి ఆహ్వానం పలికిన జనసైనికులు, వీర మహిళలు. గ్రామాల్లో ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదుసుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి,అక్రమాలను , దోపిడీలను వివరించడం జరిగింది..రానున్న ఎన్నికల్లో జనసేన ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది. గ్రామంలో ఏ అభివృద్ది ఈ 5 సం. లో జరగలేదని, సి సి రోడ్డు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, డ్రైనేజ్ కాలువల నిర్మాణం అస్సలు లేదని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని వినుత గారు ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల అధ్యక్షుడు చిన్నతోటి నాగరాజు, ఉపాధ్యక్షులు వాకాటి బాలాజీ, పట్టణ అధ్యక్షులు భాగ్య లక్ష్మి, నాయకులు బాలకృష్ణ, నరేష్, శంకర్, శ్రీనివాస్, గోవర్ధన్, వీర మహిళలు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com