గుంటూరు ( జనస్వరం ) : వైఎస్సార్సీపీ నెరవేర్చని హామీలు ఇచ్చిందని వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ఈ సందర్భంగా సిపిఎస్ రద్దు విషయంలో విఫలమైంది అన్నారు. అలానే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ మీద చలించని ప్రభుత్వం. సంపూర్ణ మద్యపాన నిషేధం చేయడంలో విఫలమైంది అన్నారు. ఇసుక కొరత వల్ల భవన కార్మికులు ప్రజల ప్రాణాలను ఈ ప్రభుత్వం తీస్తుంది అన్నారు. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాజధాని ఏమైందని, పోలవరం 2022 కి పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని అన్నారు. అప్పు చేస్తూ కేవలం ఈ ప్రభుత్వం పప్పు బెల్లాలు పంచినట్లు ఈ ప్రభుత్వం కొంత మందికి మాత్రమే నగదు పంచుకుంటూ పథకం పేరుతో బటన్ నొక్కుకుంటు ప్రజలందరికీ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అవినీతి విధానాలని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల పైన, మీడియా వారిపై దాడులు చేస్తున్నారు. అలానే ప్రజల వద్దకు ప్రజా బాటలో అలివి కానీ హామీలు ఇచ్చి నేడు ఈ వైసీపీ దౌర్జన్యం పాలనతో నష్టాలు చూస్తున్నాం అన్నారు. ఈ వైసీపీ పార్టీని అంతం చేయడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించి రండి. కదిలి రండి. మేల్కొనండి. ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడానికి జనసేన పిలుస్తుందని జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ పిలుపునిచ్చారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com