Logo
Date of Publish : 26 February 2026, 11:09 pm
Editor : Sake Naresh

గుంతకల్‌లో ఉద్యమంలా జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు

గుంతకల్, ఫిబ్రవరి 24, (జనస్వరం) : గుంతకల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జనసేన పార్టీ “ఉద్యమి” క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ప్రజల మధ్యలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గుంతకల్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త వాసగిరి మణికంఠ హాజరై మాట్లాడారు. జనంలో జనసేన, జనం కోసం జనసేన అన్న లక్ష్యంతో పార్టీ ఆశయాలను ప్రజలకు చేరవేస్తూ సభ్యత్వ నమోదు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. అనంతరం పట్టణంలో పర్యటించి దుకాణదారులు, చిరు వ్యాపారులను కలుసుకుని సభ్యత్వం ద్వారా లభించే ప్రయోజనాలను వివరించారు. పలువురు వ్యాపారులు, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వం నమోదు చేసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త, ప్రతి కుటుంబం జనసేన కుటుంబంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్, పవర్ శేఖర్, పాండు కుమార్, కప్పట్రాళ్ల కోటేశ్వరరావు, ఆటో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com