Logo
Date of Publish : 24 February 2026, 9:43 pm
Editor : Sake Naresh

గుత్తిలో ఘనంగా జనసేనపార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వ లోగో ఆవిష్కరణ

గుత్తి, ఫిబ్రవరి 22, (జనస్వరం) : గుత్తి పట్టణంలోని టీ కేఫ్‌లో సామాన్యుల మధ్య జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన “ఉద్యమి” లోగోను జనసేన శ్రేణులు ఆవిష్కరించారు. ఈనెల 26 నుంచి మార్చి 10 వరకు జరగనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గుంతకల్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త వాసగిరి మణికంఠ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసైనికులు, వీరమహిళలకు అండగా నిలవడం, వారి కుటుంబాలకు భద్రత కల్పించడం, కొత్తతరం నాయకత్వాన్ని తీర్చిదిద్దడం లక్ష్యంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ “ఉద్యమి” సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. సభ్యత్వం ద్వారా రూ.5 లక్షల ప్రమాద బీమా మాత్రమే కాకుండా నాయకత్వ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పారు. పామిడి, గుత్తి, గుంతకల్ మండలాల జనసేన శ్రేణులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ అధ్యక్షుడు పాటిల్ సురేష్, ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య, ఉపాధ్యక్షుడు వెంకటపతి నాయుడు, మండల నాయకులు, యువజన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com