అనంతపురం ( జనస్వరం ) : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీసుకునే ఏ నిర్ణయానికి అయినా తాము కట్టుబడి ఉంటాం. తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలే తమకు శిరోధార్యం. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురము జిల్లాలో గెలుపే లక్ష్యంగా జనసేన - తెలుగుదేశం పార్టీతో కలిసి పయనిస్తుందని జనసేన జిల్లా అధ్యక్షులు, అర్బన్ ఇంచార్జ్ టీ.సి.వరుణ్ అన్నారు. మంగళవారము అనంతపురము కేంద్రంలోని శ్రీ7కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన జనసేన-టిడిపి ఆత్మీయ సమన్వయ కమిటీ సమావేశానికి జనసేన పార్టీ తరఫున జిల్లా అధ్యక్షులు, అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ అధ్యక్షత వహించారు. తెలుగుదేశం పార్టీ అనంతపురము అర్బన్ ఇంచార్జ్ శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి టిడిపి తరఫున అధ్యక్షత వహించారు. జనసేన, టిడిపి పార్టీల నుండి అర్బన్ పరిధిలో ఉన్న నగర అధ్యక్షులు ల పొదిలి బాబురావు, రాష్ట్ర కార్యక్రమాల కమిటీ సభ్యులు భవాని రవికుమార్, రాయలసీమ ప్రాంతయ్య మహిళా కమిటీ సభ్యులు శల పెండ్యాల శ్రీలత, లీగల్ సెల్ అధ్యక్షులు శల మురళీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మారుతి గౌడ్, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టి.సి.వరుణ్ మాట్లాడుతూ... ఓటర్ల జాబితాలో అక్రమాలపై చర్చించాలి. ఓటర్ల జాబితాను పరిశీలించే కార్యక్రమం అదేవిధంగా రోడ్ల దుస్థితిపై ఉమ్మడి పోరాటం అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా రాక్షస వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దింపి, జనసేన-టిడిపి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాబోవు రోజులలో జనసేన తెలుగుదేశం పార్టీల కలయికలో ప్రజాక్షేత్రంలోని సమస్యలపై ఉమ్మడి పోరాటం చేస్తూ.. ఇరు పార్టీల నాయకులు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని కోరారు. అనంతలో ఎక్కడైనా కార్యకర్తలకు సమస్యలు ఎదురైతే వాటిని సమన్వయం చేసుకొని పరిష్కరిస్తామని జనసేన టిడిపి నాయకులు స్నేహపూర్వక వాతావరణంలో పనిచేయాలని వరుణ్ కోరారు. అనంతరం వైసిపి ప్రభుత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రకు సృష్టిస్తున్న అడ్డంకులను ఖండిస్తూ తీర్మానం చేశారు. అలాగే రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకుల పర్యటనలు లోకేష్ పర్యటనలు మేధావుల పర్యటనలకు కలిగిస్తున్న అడ్డంకులను ఖండిస్తూ తీర్మానం చేశారు. కార్యక్రమంలోజనసేన నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com