కాకినాడ రూరల్ ( జనస్వరం ) : నియోజకవర్గం కాకినాడ లో గల కృషి పవన్ లో ఏర్పాటు చేసిన జనసేన-టిడిపి ఆత్మీయ సమన్వయ కమిటీ సమావేశానికి జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ అధ్యక్షత వహించారు. తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ టిడిపి తరఫున అధ్యక్షత వహించారు. జనసేన, టిడిపి పార్టీల నుండి కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు గ్రామ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ... ఓటర్ల జాబితాలో అక్రమాలపై చర్చించాలి. ఓటర్ల జాబితాను పరిశీలించే కార్యక్రమం అదేవిధంగా రోడ్ల దుస్థితిపై ఉమ్మడి పోరాటం అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా రాక్షస వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దింపి, జనసేన-టిడిపి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాబోవు రోజులలో జనసేన, తెలుగుదేశం పార్టీల కలయికలో ప్రజాక్షేత్రంలోని సమస్యలపై ఉమ్మడి పోరాటం చేస్తూ.. ఇరు పార్టీల నాయకులు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని కోరారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైనా కార్యకర్తలకు సమస్యలు ఎదురైతే వాటిని సమన్వయం చేసుకొని పరిష్కరిస్తామని జనసేన - టిడిపి నాయకులు స్నేహపూర్వక వాతావరణంలో పనిచేయాలని పంతం నానాజీ కోరారు. కార్యక్రమంలో వీరమహిళలు, నాయకులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com