
విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని ఆదేశాల మేరకు, జనసేన పార్టీ యువ నాయకులు హుస్సేన్ ఖాన్ ఆధ్వర్యంలో 9వ డివిజన్ టిడిపి పార్టీ నాయకురాలు సుభద్రమ్మను స్వగృహం నందు కలిసారు. రానున్న ఎన్నికలు మరియు కొత్త ఓటర్ల నమోదు పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పండు, రమణ, మౌలా తదితరులు పాల్గొన్నారు.