గజపతి నగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గం ఇన్చార్జ్ శ్రీ మర్రాపు సురేష్ గారి అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యవర్గం,జనసేన పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు,మర్రాపు సురేష్ గారు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ లో అందరూ భాగస్వామ్యం కావాలని,బూతు స్థాయిలో ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రజలు జనసేన టీడీపీ కు మద్దతుగా ఉన్న తరుణంలో ఇరు పార్టీలు సమన్వయం తో పని చేయాలని సూచించారు.జిల్లా సీనియర్ నాయకులు డా.మిడతాన రవికుమార మాట్లాడుతూ పార్టీ శ్రేణులు ప్రజల దీర్గ కాలికంగా ఉన్న సమస్యల పట్ల పోరాడాలని, గడిచిన 5 సంవత్సరాలలో మౌలిక వసతులు కల్పన లో వైసిపి ప్రభుత్వం విఫలం ఐయ్యిందని,చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిత్యవసర వస్తువుల ధరలు పెంచి ప్రజలను పట్టి పీడిస్తున్న వైసిపి ప్రభుత్వానికి చరమగీతం పాడేవిధంగా ప్రజలను కోరాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కన్వీనర్లు, కో కన్వీనర్లు, జనసైనికులు, ముఖ్యనాయకులు,తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com