బొబ్బిలి ( జనస్వరం ) : జనసేన టీడీపీ పొత్తు ధర్మంలో భాగంగా ఈరోజు బొబ్బిలి టీడీపి ఇంచార్జ్ బేబీనాయన గారు మరియు మాజీ శాసన సభ్యులు తెంటు లక్షుంనాయుడు గారు చేస్తున్న దీక్షా శిభిరానికి వారి ఆహ్వానం మేరకు జనసేన పార్టీ తరపున సంఘీభావం తెలియజేసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు. జనసేన మండల అధ్యక్షులు, జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు పాలూరు గారు మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న వైసిపి జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని, జనసేన టీడిపి ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలియజేసారు. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ పోరాట పటిమ, నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవం మన రాష్ట్రానికి ప్రస్తుతం చాలా అవసరమని, 2024 లో ప్రజలందరి మద్దతుతో స్థాపించబోయే ప్రజా ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. చివరిగా కలసి నడుద్దాం, ప్రభుత్వాన్ని స్థాపిద్దాం, ప్రగతిని సాదిద్దాం, భవితను మారుద్దాం అనే నినాదంతో ఇరు పార్టీలు కలసి పని చెయ్యాలని పిలుపునిచ్చారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com