Logo
Date of Publish : 16 September 2023, 6:55 pm
Editor : Sake Naresh

తాడిపత్రిలో టీడీపీ చేస్తున్న రిలే నిరాహారదీక్షకు మద్దతు తెలిపిన జనసేన

             తాడిపత్రి ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమ అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రిలే నిరాహారదీక్షలకు జనసేన పార్టీ మద్దతు తెలిపింది.  తాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి మరియు గన్నేవారిపల్లే పంచాయితీ మాజీ సర్పంచ్ చింబిలి వెంకట రమణ అధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహారదీక్షలో తాడిపత్రి జనసేనపార్టీ మద్దతు తెలిపింది. జనసేన పట్టణ అధ్యక్షులు కుందుర్తి నరసింహా చారి మద్దతు తెలుపుతూ రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. ఆయన ప్రసంగింస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి అవినీతి పరుడు కాబట్టి అందరూ అవినీతిపరులు అనే బురద జల్లి జైలుకి అందరినీ తనలానే జైల్ కు వెళ్ళాలని అనుకుంటూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఏ ఒక్క జనసైనికుడు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ కేసులకు భయపడరు అని విమర్శించారు. రాబోయే 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే వైసీపీ ఓడిపోతుందని భయంతో కలవకుండా ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వారి ఎత్తులను చిత్తు చేసే విధంగా అద్భుతమైన వ్యూహంతో రెండు పార్టీలు కలిసి పోటీ చేసే విధంగా ప్రణాళికలు తయారు చేశారు. వైసీపీ ఇంటికి పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో యాడికి మండల అధ్యక్షులు కోడి సునీల్ కుమార్, పేద వాడుగుర్ మండల అధ్యక్షులు దూద్ వలి, మరియు నాయకులు కిరణ్, గోపాల్, ఇమామ్, రబ్బానీ అయుబ్, శివకుమార్ రెడ్డి, అమీర్, పవన్ కళ్యాణ్, మని, కొండ శివ, హేమంత్ కుమార్, వెంకటేష్, మధు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com