Logo
Date of Publish : 07 May 2023, 4:25 pm
Editor : Sake Naresh

ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2 లో ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట పాదయాత్ర..

            ఏలూరు ( జనస్వరం ) : ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏలూరు నగరపాలక సంస్థలోని 19వ డివిజన్ లో జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు పాదయాత్రను నిర్వహించారు.ఈ పాదయాత్రలో భాగంగా కొత్తూరులోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2 లో ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఈ డివిజన్లలో ప్రజలు చాలా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని,ప్రధానంగా డ్రైనేజీ సమస్య రోడ్డు సమస్య,మంచినీటి సౌకర్యం లేదు.. ఇక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు.. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. 2009,10 లో ఈ కాలనీ ఏర్పాటు చేశారు.. ఇప్పటికీ 13 సంవత్సరాల అయినప్పటికీ ఏ విధమైనటువంటి మౌలిక వసతులు లేవని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కొంతమందికీ కావాలని పెన్షన్లను తీసివేస్తీన్నారు.. కరెంట్ చార్జీలు ఇంటి పన్నులు అధికంగా వస్తున్నాయని కట్టలేని పరిస్థితిలో ఉన్నామని స్థానికులు వాబోతున్నారు..ఇల్లు లేని పేదవాళ్లు చాలామంది ఉన్నారు.. కనీసం మాకు ఇళ్ల స్థలాలు లేవని ఇచ్చిన వాళ్ళ దగ్గర నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.. కానీ ఇప్పటికైనా నిద్రలేచి ఉన్నటువంటి సమస్యల మీద పరిష్కార మార్గాలు చూపాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం.. చాలామంది ఇక్కడ టిడ్కో ఇళ్ళకు డబ్బులు కట్టారని ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు ఐనప్పటికీ ఆ టిడ్కో ఇళ్ళను ఇవ్వలేదని పేద ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. 2017 లోనే ఈ కాలనీ లో అంగన్వాడి సెంటర్ కావాలని తీర్మానం చేసిన ఈరోజుకి అంగన్వాడి సెంటర్ నిర్మాణం చేయలేకపోయారు అని సిగ్గులేని ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కనీసం కళ్ళు తెరిచి ఈ సమస్యకు పరిష్కారం చూపవలసిందిగా ఏలూరు జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామని అన్నారు..


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com