ఏలూరు ( జనస్వరం ) : ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల నాని ప్రజలు పడుతున్న సమస్యలను పరిష్కరించడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు మండిపడ్డారు.. 31 వ డివిజన్ అశోక్ నగర్ లో పత్తేబాద ప్రేమ్ కుమార్,వట్టి సుధాకర్, మోహన్ రావు ఆధ్వర్యంలో ఆయన శనివారం పర్యటించి, అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. జనసేన కరపత్రాలను వారికి అందించి జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకతను వాళ్లకు వివరించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఏలూరు నగరంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయని, ఏదో ఒక సాకులు చెప్పి పెన్షన్లు కట్ చేసే పరిస్థితిని కల్పించారని వైసీపీ ప్రభుత్వం కల్పించారని, ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు సైతం నిలిపి వేస్తున్నారని మండిపడ్డారు..ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, ఈ డివిజన్లో ఉన్న కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రజలు వారి యొక్క సమస్యలను మాకు వివరిస్తుంటే చాలా బాధగా ఉందని ఈ ప్రభుత్వాన్ని అంతమొందించడానికి ప్రజలంతా సంసిద్ధంతో ఉన్నారని ధ్వజమెత్తారు.. ఈ ప్రాంతంలో చిన్న తుఫాను వస్తేనే మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందని, డ్రైనేజీ సమస్యలు కూడా అధికంగా ఉన్నాయని ఈ విషయాన్ని ప్రజలు మా దృష్టికి తీసుకు వచ్చారని అన్నారు.. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు.. మంచి సుభిక్షమైన పరిపాలన అందించే దిశగా మేము ప్రయాణం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.. అలాగే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇప్పటికైనా మొద్దు నిద్ర లేవాలని ఇంకా మిగిలిన ఈ మూడు నెలల కాలంలో ప్రజలు పడుతున్న కష్టాలను తీర్చాల్సింది పోయి ఏదో హడావిడిగా ప్రతి డివిజన్ కెళ్ళి శంకుస్థాపన చేసి పబ్బం గడుపుకోవడం కాదని ఈవిధంగా జనసేన పార్టీ నుండి హెచ్చరించారు.. మారుమూల ప్రాంతాల్లో నైనా ఏ సమస్యా ఉన్నప్పటికీ క్షణాల్లో ఆ సమస్యకు జనసేన పార్టీ తరపున పరిష్కారం చూపుతామని,4న్నర సంవత్సరాలు గడుస్తున్నా వాటిని పరిష్కరించలేని స్థితిలో అధికారులు అధికార ప్రతినిధులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, పెద్ద సంఖ్యలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com