
నక్కపల్లి (జనస్వరం) నక్కపల్లి మండలంలోని మత్స్యకారులు హెటిరో కంపెనీ పైపు లైన్లకు వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా చేపట్టిన మహశాంతియుత ధర్నాకి మొదటి రోజు నుండి ఈరోజు 300వ రోజు వరకు నిరంతరం అండగా నిలబడిన జనసేన పార్టీ. 300వ రోజు సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడపాటి శివదత్ మాట్లాడుతూ సుమారు 15000 మత్స్యకార కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వరకు పట్టించుకోకుండా, కెమికల్ కంపెనీకి కొమ్ము కాయడం చాలా బాధాకరం. ప్రభుత్వం తక్షణమే స్పందించి విష రసాయన వ్యర్థ జలాలను వదిలే పైపు లైన్లను పూర్తిగా తొలగించి, మత్స్యకార గ్రామాలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోతే ఎన్నిరోజులు అయినా ఈ ధర్నా కొనసాగుతుందన్నారు. ఒకవేళ బలవంతపు చర్యలు చేపడితే మత్స్యకారుల తరుపున ఆమరణ నిరహార దీక్ష చేపట్టడానికైనా సిద్దం అని ప్రభుత్వానికి, అధికారులకు హెచ్చరిక జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.