విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ కలిసారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్నమయ్య జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో టిడిపి జనసేన అభ్యర్థులు విజయం కోసం కృషి చేయాలని కోరారు. రెండు పార్టీల నాయకుల మధ్య సమన్వయానికి కృషి చేయాలని జనసేన పార్టీ బలోపేతం చేసి అన్ని నియోజకవర్గాల్లో టిడిపి జనసేన కూటమి అభ్యర్థులు గెలిచే విధంగా కృషిచేసినదిగా మై ఫోర్స్ మహేష్ గారికి సూచించారు. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో పుంగనూరు మరియు పీలేరు నియోజకవర్గం నుంచి కొందరు వివిధ పార్టీల నాయకులు జనసేన పార్టీలోకి చేరారు. ఈ సమావేశంలో మైఫోర్స్ మహేష్ సోదరుడు ఉమేష్ మరియు ఇతర నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com