Logo
Date of Publish : 16 March 2023, 4:31 pm
Editor : Sake Naresh

జనసేన సభతో వైసీపీ పార్టీకి మతి భ్రమించింది : లాయర్ జయరాం రెడ్డి

          అనంతపురం ( జనస్వరం ) : జనసేన 10 వ ఆవిర్భావ సభకు రాష్ట్రం నలుమూలల నుండి అశేషంగా జనం తరలివచ్చి సభను విజయవంతం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల భావితరాల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ప్రసంగించిన ప్రసంగం అమాంతం జనసేన నాయకులు, కార్యకర్తలే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ ఆసక్తిగా విని రాష్ట్రాన్ని పరిరక్షించే రక్షకుడు దొరికాడు అని సంతోషంతో జనసేన పార్టీకి ఆకర్షితులైనారని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ జయరాం రెడ్డి అన్నారు.  జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం విన్న తర్వాత వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకే మా ఓటు అని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. జనసేన 10 వ ఆవిర్భావ సభ విజయవంతమైందని అక్కస్సుతో వైసిపి నాయకులు మతిభ్రమించి ఏదో ఒకటి విమర్శ చేయాలి కాబట్టి, అనవసరమైన విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మాని... వైసిపి పార్టీని, వైసీపీ శ్రేణులను ఎలా రక్షించుకోవాలో గుర్తెరిగి వసులుకుంటే మంచిది? అధికార మదమెక్కి తప్పుడు మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నామని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com