Logo
Date of Publish : 25 January 2023, 3:03 pm
Editor : Sake Naresh

విశాఖ ఉక్కు ప్రజాగర్జన మహాసభకు సంఘీభావంగా జనసేన ర్యాలీ

        విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 30వ తేదీన క్రిష్ట గ్రౌండ్ లో నిర్వహించ తలపెట్టిన ప్రజాగర్జన మహాసభ జయప్రదం చేయాలంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. గంగవరం రిహాబిలేషన్ ప్రాంతంలో వీధి వీధినా తిరుగుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను చాటారు. జీవీఎంసీ ఫ్లోర్ లీడర్, జనసేన పార్టీ కార్పోరేటర్ దల్లి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నిర్వహించిన ఈ ర్యాలీలో విశాఖ ఉక్కు పోరాట కమిటీ నేతలు డి.వి. రమణారెడ్డి, డి. ఆదినారాయణ, రాజశేఖర్, అయోధ్య రాము, కె.ఎస్.ఎస్. రావులతో పాటు విశాఖ ఉక్కు కార్మికులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు  సీహెచ్ ముసలయ్య,  బంక సాయికుమార్, రవీంద్ర కనకేశ్వరరావు, కిదిరి సత్యనారాయణ, మేక శాలనీ, జ్యోతిరెడ్డి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com