Logo
Date of Publish : 25 July 2023, 10:49 am
Editor : Sake Naresh

మద్దికెరలో సాయినగర్ లో జనసేన ప్రజా పోరాట యాత్ర

    పత్తికొండ ( జనస్వరం ) : జనసేన పార్టీ మద్దికేర మండలం నాయకులు, గద్దల రాజు, సోంపల్లి అశోక్ కుమార్, మనోజ్ కుమార్, వడ్ల నరేష్, గద్దల అజయ్, ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రజా పోరాట యాత్ర లో భాగంగా పత్తికొండ నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్ గారు మద్దికేర గ్రామంలోని సాయి నగర్ కాలనీని సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి నగర్ కాలనీకి సంబంధించిన ప్రజా సమస్యలను మౌలిక సదుపాయాల పనితీరును త్రాగునీరు మరియు గృహపకరణాల అవసరానికి ఉపయోగించే నీరు సదుపాయాలు మరియు కాలనీ రోడ్ల దుస్థితిని పారిశుభ్ర కాలువల గురించి కాలనీ వాసుని అడిగి తెలుసుకోవడం జరిగింది. కాలనీవాసులు మాట్లాడుతూ సాయి నగర్ కాలనీ ఏర్పడి దాదాపు 20 సంవత్సరాలు పైబడిన ఇప్పటివరకు పంచాయతీ ద్వారా ప్రధాన నీటిపారుదల సౌకర్యాన్ని పైప్ లైన్లను ఇంతవరకు ఏర్పాటు చేయలేదని మరియు కాలనీల మధ్య ఉండే రోడ్లను ఇప్పటివరకు సిసి రోడ్లుగా మార్చలేదని సిసి రోడ్లు లేకపోవడంతో గృహాల నుండి వచ్చే వ్యర్థ పదార్థాల నీరు రోడ్లు పైకి నిలిచిన దృశ్యాలు చూసాము. కాలువలు నిర్మించలేదని వివరించడం జరిగింది. ప్రధానంగా సాయి నగర్ కాలనీ మొత్తానికి సంబంధించి కేవలం మూడు వీధి ట్యాంకుల ద్వారా దాదాపు 400 ఇల్లలకు నీరు అందించే విధానం సరిపోవడం లేదని మరియు ఆ బోర్ల నుంచి వచ్చే నీరులో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉంటుందని కాలనీవాసులు వివరించడం జరిగింది. మద్దికేర మండలంలోని సాయి నగర్ కాలనీకి సంబంధించినటువంటి గృహాల్లో దాదాపు 30% గృహాల్లో బాడుగలకు ఉన్నటువంటి కుటుంబాలకు జగనన్న కేటాయించినటువంటి జగనన్న కాలనీలో ఎటువంటి స్థలాలు కానీ, ప్రధానమంత్రి వికాస్ యోజన కింద ఇచ్చేటువంటి గృహకల్పన సంబంధించినటువంటి పథకాలు అందలేదని కాలనీవాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు గద్దల రాజు, అజయ్ కుమార్ ఎంపీటీసీ. వడ్డే విరేష్మ, నోజ్ కుమార్,  వడ్ల నరేష్ .అశోక్ కుమార్ .ప్రభాకర్ యాదవ్, లింగరాజు, విరేష్, అంజి, శ్రీకాంత్, ఖాసే, వంశీ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com