సూర్యాపేట ( జనస్వరం ) : చివ్వేంల మండలానికి చెందిన గిరిజన యువకుడు న్యాయశాస్త్ర విద్యార్థి ధరావత్ నిఖిల్ అక్టోబర్ 9వ తేదీ అర్ధరాత్రి మిస్సింగ్ అయి 11వ తేదీ శవమై చిలుకూరు మండలం, కట్టకొమ్ముగూడెం వద్ద నాగార్జునసాగర్ కాలువలో శవమై తేలాడు. ఇప్పటి వరకు నిందితులను తట్టుకోకుండా చర్యలు తీసుకోకుండా ఆ కుటుంబానికి న్యాయం చేయకుండా ఉన్నారు... ఆ కుటుంబానికి న్యాయం జరగాలని జనసేన పార్టీ నాయకులు నిరసనలో పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్, ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సరికొప్పుల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు అందే శీను, చింతల నాగార్జున, ప్రధాన కార్యదర్శి కాంపల్లి వెంకట్, తెలంగాణ రాష్ట్ర యువజన విభాగ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పవన్ ఆల్వాల, మరియు విద్యార్థి విభాగ కోఆర్డినేటర్ గోపీనాథ్ పటేల్, ఉమ్మడి నల్లగొండ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు రామగిరి శివ సాయి, ఉపాధ్యక్షులు పున్నం రాంబాబు, విద్యార్థి విభాగ కోఆర్డినేటర్ మనోజ్ జిల్లా నాయకులు చెరుకుపల్లి రామలింగం, గుడిసె గౌతమ్, శ్రీకాంత్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com