పెందుర్తి ( జనస్వరం ) : నరవ గ్రామం లో నిత్యవసర సరుకులు పంపిణీ లో ప్రతినెల సుమారు 100 కుటుంబాలు కు రేషన్ ఇవ్వకుండా పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వంపై జనసేన పార్టీ గ్రామ ప్రజలతో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక నాయకులు గళ్ళ శ్రీనివాస గారు మాట్లాడుతూ ఇంటింటికి రేషన్ అని చెప్పి వీధివీధికి ఇస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మా నరవ గ్రామంలో ప్రతినెల విడతలవారీగా రెండు క్లస్టర్లు అనగా సుమారు 100 కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, అధికారులు గానీ ప్రజాప్రతినిధులు గాని వాలంటరీ వ్యవస్థ గాని ప్రజలు అవసరాలును తీర్చడం లేదని, దీంట్లో కొంతమంది వారి చేతివాటం చూపించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. వబ్బిన జనార్దన శ్రీకాంత్ మాట్లాడుతూ యధా రాజా తథా ప్రజా అన్నట్లుగా ముఖ్యమంత్రి గారు ఎలాగైతే ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు స్థానిక అధికారులు కూడా నిత్యవసర సరుకులను ప్రతినెల ప్రాంతాలవారీగా విడగొట్టి విడతలవారీగా సరఫరా చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఈ యొక్క సమస్యను VRO, RI, సివిల్ సప్లై వారికి పలుదపాలుగా ఈ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లనా నిమ్మకు నిరెత్తినట్లుగా ఉన్నారని, స్థానిక ప్రజాప్రతినిధులు MLA, కార్పొరేటర్ లు కూడా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ యొక్క సమస్యను అధికారులు దృష్టి తీసుకుని వెళ్లి ప్రజలకు మేలు చేసి విధముగా సహకరించాలని మీడియా ప్రతినిధులు కోరడం జరిగింది. స్థానిక మహిళలు మాట్లాడుతూ రేషన్ బియ్యం మీద ఆధారపడిన జీవినం సాగిస్తూ ఉంటాం. ప్రతి నెల ఇచ్చే మా రేషన్ బియ్యం ఏ పందికొక్కు తిన్నాది అని, ప్రజల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం మీకు తగువా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గవర రాజు, గవర శ్రీను, రాడి పెంటారావు, రాడి తేజ, జన సైనికులు మరియు ప్రజలు పాల్గొన్నారు.