బొబ్బిలి ( జనస్వరం ) : బొబ్బిలి గ్రోత్ సెంటర్ లో సత్య బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 36 ఎకరాలు కేటాయింపుపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు ప్రశ్నించారు..??.. కనీసం 5 లక్షల టర్నోవర్ కూడా లేని ఒక స్ట్రైక్ ఆఫ్ కంపెనీకి, 36 ఎకరాలు ఎలా కేటాయించారో గ్రోత్ సెంటర్ అధికారులు మరియు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ, కోడిగుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రజలకు సమాధానం చెప్పాలని మీడియా ముఖంగా డిమాండ్ చేశారు..!! మొన్న ఈ 36 ఎకరాల విలువైన భూమి కోసమేనా అకస్మాత్తుగా స్థానిక MLA కి కూడా చెప్పకుండా బొబ్బిలి గ్రోత్ సెంటర్ కి వచ్చావ్? ఒక స్ట్రైక్ ఆఫ్ కంపెనీకి ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా APIIC ద్వారా 36 ఎకరాల మా బొబ్బిలి భూమిని ఎలా అప్పనంగా ఇచ్చేస్తారని జనసేన నాయకులు బాబు పాలూరు గారు ప్రశ్నించారు. ఈ ప్రెస్మీట్ లో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, వీరమహిళలు రమ్య, కమళిక, జనసేన నాయకులు కిరణ్, పల్లెం రాజా, చీమల సతీష్, హారిచరణ్, శివ తదితరులు పాల్గొన్నారు.