నెల్లూరు, నవంబర్ 28, (జనస్వరం) : మహాత్మ జ్యోతిరావు ఫులే 135వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ మినీ బైపాస్ వద్ద ఉన్న జ్యోతిరావు ఫులే దంపతుల విగ్రహానికి పార్టీ నాయకులు మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, బానిసత్వం, పేదరికం, సామాజిక వివక్షల మధ్య మగ్గిన మహిళలు, బడుగు బలహీన వర్గాలకు జ్యోతిరావు ఫులే ఒక కాంతిరేఖలా నిలిచారని గుర్తుచేశారు. పుట్టుక, కులం, మతం ఆధారంగా ఎవరినీ తక్కువగా చూడటం తగదని, సమానత్వమే సమాజ ప్రగతికి పునాది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలుమార్లు తెలియజేశారని పేర్కొన్నారు. ఆ కాలంలో నెలకొన్న జాతి వివక్ష, స్త్రీ వివక్ష, అంటరానితనం, బాల్యవివాహాలు, సతీసహగమనం వంటి దురాచారాల నిర్మూలనకు ఫులే దంపతులు అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. ముఖ్యంగా మహిళల విద్య, సామాజిక చైతన్యం కోసం వారు చేసిన పోరాటం నేటి తరాలకు ఆదర్శమని అన్నారు. సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగాలంటే విద్య ఒక్కటే మార్గమని ఫులే బోధనను స్ఫూర్తిగా తీసుకొని, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ కార్యక్రమాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సీనియర్ నాయకులు మల్లికార్జున యాదవ్, జిల్లా కార్యాలయం ఇన్చార్జి జమీర్, జనసేన నాయకులు బెల్లపు సుధామాధవ్, గుర్రం కిషోర్, శ్రీకాంత్, పవన్, శీను ముదురాజ్, హరికృష్ణ, మహేష్ శర్మ, రాజేష్, సాయి, నాగేంద్రబాలు, కృష్ణమోహన్ రెడ్డి, ప్రతాప్, నరహరి, వర్షన్, జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.