నెల్లూరు ( జనస్వరం ) : 32 వ డివిజన్ క్రియాశీలక కార్యకర్త ప్రసన్నను వారి కుటుంబ సభ్యులను ఇరుగు పొరుగు వారిని కలిసి కుటుంబ సమేతంగా ఈసారి జనసేనకు అవకాశం ఇవ్వాలంటూ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ 2వ రోజు కార్యక్రమాన్ని సాగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ పై పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉందని ఈ అభిమానం ను బూతు స్థాయి దాకా తీసుకెళ్ళి గాజు గ్లాసు కు ఓటు వేసేదాకా తమ వంతు కృషి చేస్తామని, ఏ కార్యకర్తకు ఇబ్బంది ఎదురైన జిల్లా కమిటీ తరఫున లీగల్ సెల్ తరఫున గట్టిగా నిలబడి పోరాడుతామని స్థానిక సమస్యలపై సమర శంఖం పూరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి కార్యకర్తను కలిసి పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా జనసేన పార్టీ జిల్లా గునుకుల కిషోర్ తో పాటు ప్రశాంత్ గౌడ్, అమీన్, హేమంత్ యాదవ్, మౌనేష్ తదితరులు పాల్గొన్నారు.