వేమూరు ( జనస్వరం ) : ఎమ్మార్పీఎస్ న్యాయమైన పోరాటానికి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని జనసేన పార్టీ నాయకులు సోమరౌతు బ్రహ్మం తెలియజేశారు. ఆదివారం మండలంలోని వరహపురం చదలవాడ వెళ్ళబాడు గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి పర్యటించారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ తలపెట్టనున్న మాదిగల విశ్వరూప ప్రదర్శన సభను జయప్రదం చేయాలని అదేవిధంగా ఎమ్మార్పీఎస్ పోరాటానికి మద్దతు తెలిపిన జనసేన పార్టీకి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జనసేన నేత పవన్ కళ్యాణ్ మాదిగల న్యాయం పరమైన కోర్కెలు పరిష్కారం కోసం తన వంతు సహకారం అందిస్తారని విజ్ఞప్తి చేశారు. ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ దేవదాసు మాదిగ మాట్లాడుతూ మాదిగల విశ్వరూప సభ విజయవంతానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు యల్లమాటి దాసు మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ఆలపాటి రాజేష్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.