పిఠాపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ ఇన్చార్జి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఆదేశాల మేరకు పిఠాపురం పారిశుద్ధ కార్మికులు మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా సమ్మె నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం సిఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల హక్కులకై నిరవధిక సమ్మె చేస్తున్నారు. వారికి మద్దతుగా పిఠాపురం జనసేన పార్టీ పి.ఎస్.ఎన్.మూర్తి టీం మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు పిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ వారికి జనసేన పార్టీ ఎప్పుడు మద్దతుగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులు కరోనా సమయంలో ఎంతోసేవనందించారని కానీ వారికి ఇవ్వాల్సిన కనీస అవసరాలు కూడా ఈ ప్రభుత్వం తీర్చడం లేదని వెంటనే వారి డిమాండ్లు తీర్చలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, కర్రీ కాశి, కసిరెడ్డి నాగేశ్వరరావు, పెదిరెడ్ల భీమేశ్వరరావు, ముప్పన రత్నం, పెంకే జగదీష్, నామ సాయి, నామా శ్రీకాంత్, విగ్నేష్, బెజవాడ రామకృష్ణ మరియు పిఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com